Chirala: చీరాల మున్సిపాలిటీలో షాకింగ్.. తొలిరోజు ‘నిల్‌’ నామినేషన్లు!

Chirala: చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులెవరూ రాకపోవడంతో నిల్‌గా నిలిచింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 16 Oct 2026 8:48 PM IST
Chirala
X

Chirala: చీరాల మున్సిపాలిటీలో షాకింగ్.. తొలిరోజు ‘నిల్‌’ నామినేషన్లు!

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలి రోజే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందుకు రాలేదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులో తొలి రోజు నామినేషన్లు దాఖలు కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ అభ్యర్థుల నుంచి స్పందన కనిపించలేదు. ఎన్నికల బరిలో నిలవాలనుకునే ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తు, అనుకూలతలు, ఇతర అంశాలపై ఆలోచించి నామినేషన్ల దాఖలుకు దూరంగా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తొలిరోజే ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తదుపరి రోజుల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు వస్తారా? రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉండనున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala