Chirala: 15వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున అమర్నాథ్ ప్రచారం!
Chirala: చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు కూటమి అభ్యర్థి మామిడాల శ్రీనివాసరావు, చైర్పర్సన్ అభ్యర్థి హానీ స్పందన తరఫున మద్దులూరి గౌరీ అమర్నాథ్ ప్రచారం.
Chirala: 15వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున అమర్నాథ్ ప్రచారం!
చీరాల: చీరాల పట్టణ స్థానిక కూటమి అభ్యర్థి 15 వ వార్డ్ మామిడాల శ్రీనివాసరావు కూటమి పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి శ్రీమతి హానీ స్పందన విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చీరాల నియోజకవర్గ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఎలా పరుగులు పెడుతున్నాయో మీరంతా చూస్తున్నారు. ఇదే అభివృద్ధి ప్రతి వార్డుకు నేరుగా చేరాలంటే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి నాయకులను ఆశీర్వదించండి. కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, మన ప్రాంతాల అభివృద్ధికి ప్రజలే శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..
"చెప్పాం... చేస్తున్నాం" అన్న నినాదంతో స్థానిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్నాం కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం అంటోంది కూటమి ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో కూడా తమను గెలిపించి జరుగుతున్న అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్నీ కొనసాగేలా చూడమంటోంది.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. చీరాల పట్టణం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నా, ఎలాంటి రాజకీయ రగడలు లేని ప్రశాంతమైన సుందరమైన పట్టణంగా రూపుదిద్దుకోవాలన్నా కూటమి ప్రభుత్వ అభ్యర్ధుల గెలుపు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య నాయకత్వంలో చీరాల మున్సిపాలిటీలో చైర్మన్ పీఠంతో పాటు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను కూటమి పార్టీలు ఘనవిజయం సాధిస్తాయని స్థానిక ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించడంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది
స్థానిక ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, మిత్రపక్షాల నేతలు మరియు మహిళా నాయికలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.




