Chirala: చీరాల మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ వినోద్
Chirala: చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని ఆదేశం.
Chirala: చీరాల మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ వినోద్
చీరాల: చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న చీరాల పురపాలక సంఘ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. పరిశీలించారు. ఈనెల 1 న జరిగిన చీరాల మున్సిపల్ ఎన్నికల ను శుక్రవారం చీరాల ఇంజనీరింగ్ కళాశాల నందు ఓట్లు లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఓట్లు లెక్కింపు ప్రక్రియ లో ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సిబ్బందిని ఆదేశించారు.
వర్షం కారణంగా నవంబర్ 3న జరగాల్సిన ఓట్ల లెక్కింపు వాయిదా పడగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ స్థానానికి 8 మంది అభ్యర్థులు, 44 వార్డులకు 163 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్న విషయం తెలిసిందే.ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించడం జరుగుతుందన్నారు.




