Chirala: 2036 ఒలింపిక్స్‌లో భారత్ ప్రథమ స్థానమే లక్ష్యం: కబీర్!

Chirala: 2036 ఒలింపిక్స్‌లో భారత్ అగ్రస్థానమే లక్ష్యంగా క్రీడారంగంలో సమూల మార్పులు, పాలనలో పారదర్శకత తీసుకురావాలని కోచ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎస్.కె.హెచ్. కబీర్ పిలుపునిచ్చారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 10 Nov 2026 6:58 PM IST
Chirala
X

Chirala: 2036 ఒలింపిక్స్‌లో భారత్ ప్రథమ స్థానమే లక్ష్యం: కబీర్!

చీరాల 10 నవంబర్ 2026: భారత క్రీడారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చి, ప్రపంచ స్థాయిలో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని కోచ్ మరియు బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎస్.కె.హెచ్. కబీర్ పేర్కొన్నారు. 2036లో జరగనున్న ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో భారత్ ప్రథమ స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.

భారతదేశంలో అపారమైన క్రీడా ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన శిక్షణ, ఆర్థిక సహకారం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, తగిన ప్రోత్సాహం లేక అనేకమంది క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) పాలకమండలిలో సమర్థవంతమైన నాయకత్వంతో పాటు అనుభవజ్ఞులైన కార్పొరేట్ ప్రతినిధులు, మాజీ క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా రంగ నిపుణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. క్రీడాకారుల హక్కులు, సంక్షేమం, ఆర్థిక భద్రత, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య బీమా, పారదర్శక ఎంపిక విధానాలకు చట్టపరమైన రక్షణ కల్పించాలన్నారు. క్రీడా సంఘాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సామర్థ్యాన్ని క్రీడారంగ అభివృద్ధికి వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు.

2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతి క్రీడాకారుడికి ప్రపంచస్థాయి శిక్షణ, అత్యాధునిక క్రీడా సదుపాయాలు, నాణ్యమైన కోచింగ్ అందించాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, కార్పొరేట్ సంస్థలు, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేస్తే భారత్ ప్రపంచ క్రీడారంగంలో అగ్రస్థానానికి చేరుకోగలదని ఎస్.కె.హెచ్. కబీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ కేవలం ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశంగా కాకుండా, ప్రపంచ క్రీడారంగాన్ని శాసించే అగ్రగామి దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. బలమైన క్రీడా వ్యవస్థ, భద్రమైన క్రీడాకారుల భవిష్యత్తు, 2036 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రథమ స్థానం అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala