Chilakaluripet: చిలకలూరిపేటలో పోలీసుల సాయుధ కవాతు!
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రమేష్ నేతృత్వంలో పోలీసులు సాయుధ కవాతు (రూట్ మార్చ్) నిర్వహించారు.
Chilakaluripet: చిలకలూరిపేటలో పోలీసుల సాయుధ కవాతు!
Chilakaluripet: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి గారి ఆదేశాలు, సూచనల మేరకు శుక్రవారం సాయంత్రం చిలకలూరిపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో సాయుధ కవాతు నిర్వహించారు.
చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్ గారి నేతృత్వంలో 150 మంది ప్రత్యేక పోలీసు బలగాలతో ఎన్ఆర్టీ సెంటర్ నుంచి చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్ మీదుగా అడ్డరోడ్డు వరకు కవాతు కొనసాగింది. పట్టణంలోని సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందనే సందేశాన్ని ఈ కవాతు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ రమేష్ గారితో పాటు, రూరల్ సీఐ సుబ్బనాయుడు,ఎస్ఐలు సోమేశ్వరరావు, హాజరత్తయ్య మరియు టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




