Vinukonda: సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: వినుకొండలో ఎన్ఎస్పీ కాలువ వద్ద పేరుకుపోయిన చెత్తపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌కు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తక్షణమే స్పందించి శుభ్రం చేయించారు.
Vinukonda: సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలువ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తక్షణమే స్పందించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ను చూసిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా
జీవీ ఆంజనేయులు స్వయంగా ఎన్ఎస్పీ కాలువ వద్దకు చేరుకుని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కాలువ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.తమ సమస్యను దృష్టికి తీసుకురాగానే స్పందించి కాలువను శుభ్రం చేయించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.




