Vinukonda: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ!
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
Vinukonda: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ!
Vinukonda: వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం క్రమం తప్పకుండా పెన్షన్లు అందజేస్తోందని తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జీవీ ఆంజనేయులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




