Vinukonda: వినుకొండలో ఓటు హక్కు వినియోగించుకున్న చీఫ్ విప్ జీవీ!

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. 8వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 1 Nov 2026 10:13 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో ఓటు హక్కు వినియోగించుకున్న చీఫ్ విప్ జీవీ!

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచే పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ప్రజాస్వామ్య పండుగలో భాగంగా మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది తగిన చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పట్టణంలోని 8వ వార్డు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని చాటుతూ ఆయన తన ఓటు వేశారు.

ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసే వరకు ఇదే ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA