Vinukonda: కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి!
Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. 22, 23 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
Vinukonda: కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి!
Vinukonda: వినుకొండ పట్టణంలోని కొండమెట్ల బజార్ వద్ద మున్సిపల్ ఎన్నికల ప్రచారoలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా 22, 23వ వార్డుల్లో ఆయన ఇంటింటికీ తిరుగుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందిస్తున్న సంక్షేమ పథకాలు, 'సూపర్ సిక్స్' హామీల అమలు తీరును ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. వినుకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షమీంఖాన్తో పాటు 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వినుకొండ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి వైపే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలో విచ్చలవిడిగా లభించిన గంజాయి సంస్కృతిని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా అణచివేశామని ఆయన స్పష్టం చేశారు. వినుకొండ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.




