Guntur: తైక్వాండోలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే నసీర్
Guntur: తైక్వాండోతో శారీరక దృఢత్వం, ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ బీఆర్ స్టేడియంలో ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభిస్తూ అన్నారు.
Guntur: తైక్వాండోలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే నసీర్
Guntur: తైక్వాండో క్రీడల ద్వారా శారీరిక దృఢత్వం, మానసిక ఉల్లాసంతోపాటు కెరీర్ ను మలుచుకునే అవకాశం ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం స్థానిక బిఆర్ స్టేడియంలో రషీద్ టెక్ వండో అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాంపియన్షిప్ పోటీలకు ఎమ్మెల్యే నసీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పోటీలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టైక్వాండో క్రీడ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏకాగ్రతకు దోహదపడే ఇలాంటి క్రీడల వైపు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు.
గత డీఎస్సీలోనూ స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు అందించినట్లు తెలిపారు. గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడా విభాగంలో అంకుఠిత దీక్షతో కృషి చేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.




