Vinukonda: వినుకొండలో వైఎస్సార్సీపీ ఇంటింటి ప్రచారం జోరుగా మున్సిపల్ పోరు
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చైర్మన్ అభ్యర్థి పి.ఎస్. ఖాన్ పాల్గొన్నారు.
Vinukonda: వినుకొండలో వైఎస్సార్సీపీ ఇంటింటి ప్రచారం జోరుగా మున్సిపల్ పోరు
Vinukonda: వినుకొండ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పఠాన్ సాలేహ ఖాన్ (పి.ఎస్. ఖాన్) 3, 4వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల ఆశీర్వాదం కోరారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీనివాస్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బొల్లా బ్రహ్మనాయుడు, పి.ఎస్. ఖాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వార్డుల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వినుకొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి పి.ఎస్. ఖాన్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగారు.వినుకొండ మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రజల ఆశీర్వాదం, మద్దతు కోరుతూ నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




