Vinukonda: వినుకొండ 11, 12, 13వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లా ప్రచారం!

Vinukonda: వినుకొండ 11, 12, 13వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం. పీఎస్ ఖాన్, 36 మంది అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలని బొల్లా బ్రహ్మనాయుడు విజ్ఞప్తి.

KAREEMULLA, VINUKONDA
Published on: 25 Oct 2026 2:56 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ 11, 12, 13వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లా ప్రచారం!

Vinukonda: వినుకొండ పట్టణంలోని 11, 12, 13వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, మహిళలు స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఆయా వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పట్టణంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.

ప్రజల ఆశీస్సులు, మద్దతుతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు వినుకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పఠాన్ సాలేహ ఖాన్ (పీ.ఎస్. ఖాన్)ను ప్రజలు తమ ఇంటి బిడ్డగా భావించి ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరారు.ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పీ.ఎస్. ఖాన్‌తో పాటు 36 వార్డుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA