Bapatla: సముద్ర స్నానానికి వచ్చి అస్వస్థతతో తెనాలి ఆటో డ్రైవర్ మృతి!
Bapatla: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన తెనాలి ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Bapatla: సముద్ర స్నానానికి వచ్చి అస్వస్థతతో తెనాలి ఆటో డ్రైవర్ మృతి!
బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన తెనాలికి చెందిన ఆటో డ్రైవర్ యూనియన్ లో ఒక వ్యక్తి మద్యం సేవించి ఒడ్డునే స్నానం చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
సముద్ర తీరంలో ఒడ్డునే మోకాళ్ళ లోతు స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో, అతనితో పాటు వచ్చిన స్నేహితులు, బాపట్ల సూర్యలంక స్విమ్మర్స్, అవుట్ పోస్ట్ పోలీసులు, మెరైన్ పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అతన్ని సముద్ర తీరానికి సమీపంలోని ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.
108 సిబ్బంది అతడిని హుటాహుటిన బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనతో సూర్యలంక సముద్ర తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సూర్యలంక బీచ్ కు పర్యాటకుల రాక ఎక్కువగా ఉంటుంది. సెలవు రోజుల్లో కుటుంబాలతో సహా వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. సముద్ర స్నానం చేసే సమయంలో పర్యాటకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. మద్యం సేవించి సముద్రంలోకి దిగడం ప్రాణాలకే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




