Bapatla: రూ.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Bapatla: బాపట్లలో రూ.29 కోట్ల పట్టణాభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పాల్గొన్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ.
Bapatla: రూ.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బాపట్ల: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం, మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రజలు సౌకర్యవంతంగా జీవించేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలోని 123 మున్సిపాలిటీల్లో రూ.11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మున్సిపాలిటీకి రూ.29 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి వర్చువల్ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఆర్డీవో హరికుమార్, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారు.




