Repalle: రేపల్లెలో టీడీపీని గెలిపించండి: మంత్రి అనగాని సత్యప్రసాద్!

Repalle: బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి కుర్ర అవర్ణ, కౌన్సిలర్ల గెలుపు కోసం మంత్రి అనగాని సత్యప్రసాద్ ముమ్మర ప్రచారం నిర్వహించారు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 29 Oct 2026 6:40 PM IST
Repalle
X

Repalle: రేపల్లెలో టీడీపీని గెలిపించండి: మంత్రి అనగాని సత్యప్రసాద్!

రేపల్లె: రేపల్లె పట్టణ అభివృద్ధి సాధన కోసం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి అనగాని సత్యప్రసాద్. రేపల్లె పట్టణంలోని 2, 3, 4వ వార్డులలో మంత్రి సత్యప్రసాద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. స్థానిక ప్రజలు, ఓటర్లతో నేరుగా ముచ్చటిస్తూ టీడీపీ మేనిఫెస్టోలోని పలు అభివృద్ధి అంశాలను వివరించిన మంత్రి.

కూటమి మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి కుర్ర అవర్ణతో పాటు, ఆయా వార్డులలో పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపిస్తేనే రేపల్లె పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతాయి.

పట్టణ మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా వంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతాం. ఓటర్లందరూ తెలుగుదేశం పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని పిలుపు ఇచ్చిన మంత్రి. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు, స్థానిక కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE