Bapatla: బాపట్ల కూటమిలో కుమ్ములాట: అన్నం సతీష్ వర్గం అసంతృప్తి!

Bapatla: బాపట్ల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించగా, స్థానికేతరుడు ఇస్కా సునీల్‌కు అవకాశం ఇవ్వడంపై అన్నం సతీష్ ప్రభాకర్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Bakka Deepak, Bapatla
Published on: 15 Nov 2026 1:45 PM IST
Bapatla
X

Bapatla: బాపట్ల కూటమిలో కుమ్ములాట: అన్నం సతీష్ వర్గం అసంతృప్తి!

బాపట్ల: స్థానికేతరులకు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తే మాత్రం తాము సహకరించమని బాపట్ల భాజపానేత అన్నం సతీష్ ప్రభాకర్ వర్గీయులు మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో భాగంగా అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల ఎమ్మెల్యే వేగేసేన నరేంద్ర వర్మ తో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయి 27,000 ఓట్లు పైచిలుకు మెజారిటీ తో ఘన విజయం సాధించారు.

బాపట్ల లో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగిన దగ్గర నుండి మున్సిపల్ చైర్మన్ పీఠం చుట్టూ రాజకీయ చదరంగం మొదలైంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమిలో భాగంగా బిజెపి కి అధిష్టానం కేటాయించింది. ఈ నేపథ్యంలో బాపట్ల చైర్మన్ సీటుకు స్థానికేతరుడు ఇస్కా సునీల్ అనే వ్యక్తిని బాపట్లకు చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం పంపించింది.

ఆయన స్థానికుడు కాదు అంటూ మున్సిపల్ ఓటర్లు కూటమికి ఎదురు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పుర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాపట్ల కూటమిలో భాగంగా అన్నం సతీష్ ప్రభాకర్ ఉన్నాగాని ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కానీ ప్రభుత్వాలు తప్పు చేస్తే అది ప్రతిపక్షమైనా, మిత్రపక్షమైన ఎప్పటికప్పుడు ఎండ కడుతూనే ఉంటారు.

అన్నం సతీష్ ప్రభాకర్. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పై అనేక ఘాటు విమర్శలు చేస్తూ తప్పులను ఎండగడుతు అనునిత్యం ప్రభుత్వ ని ప్రశ్నిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు సతీష్ ప్రభాకర్. కూటమిలో భాగంగా 2024 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉండకపోయినా ప్రజలకు ఎప్పుడు అయన దగ్గరగానే ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ బాపట్ల నియోజకవర్గ ప్రజలకు నమ్మిన నాయకుడుగా సతీష్ అడుగులు వేస్తున్నారు.

స్థానిక నాయకత్వానికి తమ నాయకుడు అయినా సతీష్ ప్రభాకర్ ఎప్పుడు వ్యతిరేకం కాదని అయన వర్గాలు తెలిపాయి. బాపట్ల లో ప్రస్తుతం ఉన్న 44 వార్డులకు అన్నం సతీష్ ప్రభాకర్ మనుషులతో ఇండిపెండెంట్గా పురపోరు బరిలో ఉంచుతున్నట్లు ఆయన వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

కచ్చితంగా స్థానికేతరుడుకు మాత్రం చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టమని సతీష్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాత్రం కూటమి ప్రభుత్వానికి నేనెప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కూటమిలో భాగంగా బిజెపికి చైర్మన్ సిటు ను కేటాయించింది.

కచ్చితంగా కూటమికి కట్టుబడి కూటమి లో ఉంటూ రాజకీయం చేస్తానని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఈ మార్పుల వలన బాపట్ల పట్టణ ఓట్లన్నీ చీలిపోయి చైర్మన్ పీఠం కూటమికి దక్కదంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. ఇది ఇలా ఉండగా కూటమి చైర్మన్ అభ్యర్థి ఆయన ఇస్కా సునీల్ మాట్లాడుతూ 2019లో 2024 లో నేను బాపట్ల లోనే నా ఓటు హక్కు వినియోగించుకుట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇంతకంటే నేను స్థానికుడను కాదు అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికి పట్టం కడతారా.లేక స్థానికేతరులకు అవకాశం ఇస్తారా.అన్నం సతీష్ ప్రభాకర్ మనుషులకు అవకాశం ఇస్తారా వేచి చూడాలి.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla