Bapatla: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే!
Bapatla: సూపర్ ఎల్ నినో ప్రభావంతో రైతులు ఆందోళన చెందవద్దని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు.
Bapatla: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే!
బాపట్ల: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో ప్రస్తుతం 30 శాతం మేరకే వరి సాగు జరుగుతోందన్నారు.
సముద్రతీర ప్రాంతం కావడంతో వాతావరణ ప్రభావం రైతులపై అధికంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది గోదావరి జలాలతో పంటలకు సమృద్ధిగా నీరు అందేలా చర్యలు ఉంటాయన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు.
పంటల బీమా కింద ఎకరాకు రూ.20 వేల వరకు, పశుగ్రాసానికి రూ.32 వేల వరకు పరిహారం అందే అవకాశం ఉందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.




