Bapatla: కూటమి అభ్యర్థి ఇస్కా సునీల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి.. ఎమ్మెల్యే!

Bapatla: బ్యూటిఫుల్ బాపట్ల అభివృద్ధి కోసం కూటమి బలపరిచిన బీజేపీ నేత ఇస్కా సునీల్‌ను మున్సిపల్ చైర్మన్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కోరారు.

Bakka Deepak, Bapatla
Published on: 17 Nov 2026 7:14 AM IST
Bapatla
X

Bapatla: కూటమి అభ్యర్థి ఇస్కా సునీల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి.. ఎమ్మెల్యే!

Bapatla: సోమవారం మంత్రులతో కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ స్వయంగా కూటమి చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ తో నామినేషన్ దాఖలు చేయించారు.బ్యూటిఫుల్ బాపట్లగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన బిజెపి నేత ఇస్కా సునీల్ ను బాపట్ల ప్రాంతవాసులు ఘనవిజయంతో మునిసిపల్ చైర్మన్ గా గెలిపించాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కోరారు.

బాపట్లలో పుట్టి పెరిగిన వ్యక్తి ఇస్కా సునీల్. పై చదువులు మరియు ఉద్యోగాల నిమిత్తమే మరొక ప్రాంతానికి వెళ్లారు తప్ప ఆయన స్వస్థలం బాపట్ల అని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పష్టం చేశారు.

సునీల్ తండ్రి బాపట్లలో లెక్చరర్ గా కూడా పని చేసారని ఎమ్మెల్యే అన్నారు. మొదటిలో సునీల్ బాపట్ల వాసి కాదు అని నేను బ్రమ పడ్డ కానీ...నా వంతు నేను కూడా విచారణ జరపగా ఈయన బాపట్ల వాసిఅని తనకు తెలిసిందని ఎమ్మెల్యే తెలియజేశారు.బాపట్ల లో జరిగే అభివృద్ధిని ఎవరు ఆపలేరని అయన తెలిపారు.

ఇస్కా సునీల్ అనే వ్యక్తి విద్యావంతుడు ఓసారి అందరూ అవకాశం కల్పించాలని నరేంద్ర వర్మ పేర్కొన్నారు. కూటమి ధర్మానికి తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

బాపట్ల మున్సిపాలిటీకి కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి తోడ్పడే వ్యక్తి సునీల్ అని ఎమ్మెల్యే తెలిపారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పదివేల పైచిలుకు మెజారిటీతో ఇస్కా సునీల్ ను గెలిపించాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కోరారు

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla