Bapatla: చెరుకుపల్లి ఎంపీపీగా బొర్రు రూప శ్రీ ఘన ప్రమాణ స్వీకారం!
Bapatla: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా బొర్రు రూప శ్రీ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షురాలిగా ఉప్పాల సంధ్య ఎన్నికయ్యారు.
Bapatla: చెరుకుపల్లి ఎంపీపీగా బొర్రు రూప శ్రీ ఘన ప్రమాణ స్వీకారం!
బాపట్ల: చెరుకుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) ఏకగ్రీవంగా ఎన్నికైన బొర్రు రూప శ్రీ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కట్టా శ్రీనివాస్ నూతన ఎంపీపీ రూప శ్రీ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన రూప శ్రీకి మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉప్పాల సంధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఉపాధ్యక్షురాలు ఉప్పాల సంధ్య ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందించారు.




