Bapatla: కరాటే టోర్నమెంట్లో చీరాల సందీప్ స్కూల్ విద్యార్థుల విజయకేతనం!
Bapatla: ఒంగోలు ఆచార్య ఎన్జీ రంగా భవన్లో నిర్వహించిన సెకండ్ ఇంటర్ డోజో షోటోకాన్ కరాటే టోర్నమెంట్లో బాపట్ల జిల్లా చీరాల సందీప్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
Bapatla: కరాటే టోర్నమెంట్లో చీరాల సందీప్ స్కూల్ విద్యార్థుల విజయకేతనం!
బాపట్ల: ఒంగోలులోని ఆచార్య ఎన్.జి. రంగా భవన్లో నిర్వహించిన సెకండ్ ఇంటర్ డోజో షోటోకాన్ కరాటే టోర్నమెంట్లో చీరాల సందీప్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. గ్రూప్ (A) కాటా విభాగంలో చిమట గోపీచంద్ ప్రథమ స్థానం సాధించగా, Ch. తేజస్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గ్రూప్ (B) కాటా విభాగంలో అక్కల కేశవరెడ్డి ప్రథమ స్థానం సాధించగా, కొణిజేటి డుండి ద్వితీయ స్థానాన్ని గెలుచుకున్నాడు.
ఈ సందర్భంగా సందీప్ విద్యాసంస్థల చైర్మన్ & కరస్పాండెంట్ తుళ్ళూరి ఉషారాణి గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు శారీరక సామర్థ్యాన్ని పెంపొందించే క్రీడల్లో పాల్గొనాలని, కరాటే వంటి యుద్ధ కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు.
సందీప్ స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ టి. వెంకటేశ్వర్లు (టీవీ సార్) మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే క్రీడలు, వ్యాయామం, కరాటే వంటి యుద్ధ కళలను నేర్పిస్తున్న పాఠశాల సిబ్బందిని కరాటే ఇన్స్ట్రక్టర్ శివ ప్రసాద్ ని అభినందించారు.




