Bapatla: సీఎం నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన సక్సెస్

Bapatla: బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన పటిష్ట పోలీస్ బందోబస్తుతో విజయవంతమైందని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వెల్లడి. మురుసు తుఫాను బాధితులకు పరామర్శ.

Bakka Deepak, Bapatla
Published on: 6 Nov 2026 8:59 PM IST
Bapatla
X

Bapatla: సీఎం నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన సక్సెస్

బాపట్ల: పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా పర్యటన ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. మురుసు తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు.

జిల్లా పరిధిలోని సూర్యలంక, ముత్తాయపాలెం, బాపట్ల పట్టణం, జమ్ములపాలెం, జిల్లెళ్లమూడి తదితర ప్రాంతాల మీదుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు పరిధిలో గల నీటమునిగిన రైతుల పొలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో అతి తక్కువ సమయంలోనే జిల్లా ఎస్పీ ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బందోబస్తు విధులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసి, పర్యటనకు సంబంధించిన పరిస్థితులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వహించారు.

అతి తక్కువ సమయంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించి, రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla