Chirala: చీరాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు.. స్థానికంగా కలకలం!

Chirala: బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరా ధ్వంసం చేసి ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 27 Nov 2026 2:35 PM IST
Chirala
X

Chirala: చీరాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు.. స్థానికంగా కలకలం!

చీరాల: బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం సెంటర్‌లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులు.. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి, అనంతరం విగ్రహానికి నిప్పు పెట్టినట్లు సమాచారం.

ఈ ఘటనతో స్థానికులు భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఆంజనేయ స్వామి విగ్రహంపై జరిగిన ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు. పోలీసులు విచారణలో భాగంగా చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానితుడు ఆచూకీ తెలియడంతో విచారణకు తీసుకువెళ్లిన టూ టౌన్ పోలీసులు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala