Guntur: ఆసియా కెటిల్‌బెల్ పోటీల్లో జావేద్ అహ్మద్‌కు రజతం!
Guntur: గోవాలో జరిగిన ఆసియా కెటిల్‌బెల్ ఛాంపియన్షిప్లో జావేద్ అహ్మద్ రజత పతకం సాధించారు. డాక్టర్ పి.వి. రాఘవ శర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.
Guntur: ఆసియా కెటిల్‌బెల్ పోటీల్లో జావేద్ అహ్మద్‌కు రజతం!
గుంటూరు: గోవాలో వరల్డ్ కెటిల్బెల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (WKSF) ఆధ్వర్యంలో అక్టోబర్ 23 నుంచి 25 వరకు నిర్వహించిన ఆసియా స్థాయి కెటిల్బెల్ ఛాంపియన్షిప్లో జావేద్ అహ్మద్ అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. వన్ ఆర్మ్ లాంగ్ సైకిల్ (One Arm Long Cycle) 10 నిమిషాల విభాగంలో 24 కిలోల కెటిల్బెల్తో పోటీపడి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గిరేవాయ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, లలిత గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పి.వి. రాఘవ శర్మ జావేద్ అహ్మద్ను ప్రత్యేకంగా అభినందించారు. కఠోర సాధన, పట్టుదల, క్రమశిక్షణతో ఆసియా స్థాయిలో రజత పతకం సాధించడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని పేర్కొన్నారు.




