Guntur: గుంటూరులో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి, మోడీ ప్రజాసేవ వేడుకలు!

Guntur: ప్రధాని మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గుంటూరులో బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 30 Sept 2026 7:59 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి, మోడీ ప్రజాసేవ వేడుకలు!

Guntur: ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్బంగా సేవా - సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాల సందర్బంగా (అక్టోబర్ 15) బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ అలీం ఆధ్వర్యంలో పట్టాభిపురం రెండో లైనులోని పట్టాభిపురం హైస్కూల్ నందు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముందుగా పట్టాభిపురం స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ మరియు వ్యాసరచన వకృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా విచ్చేసి మాట్లాడుతూ భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం చిన్నప్పటి నుంచి పేదరికంలో ఉన్న ఆయన కన్న కలలు సాకారం కోసం పేపర్ బాయ్ నుంచి మిస్సైల్ మెన్ వరకు మరియు భారత రాష్ట్రపతి అయ్యేంతవరకు ఆయన నిరంతర కృషి పట్టుదల, ఆయన దృఢ సంకల్పం మరియు దేశం పట్ల ఆయనకున్న అభిమానం గొప్పదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సేవ సంకల్ప్ అభయాన్ కార్యక్రమం పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది.

దేశం పట్ల విద్యార్థులు వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంకల్పం చాలా గొప్పదని తెలియజేసినారు.

మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ అలీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరపతిరావు బిజెపి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ సాంబశివరావు బజరంగ్ రామకృష్ణ, నారాయణరెడ్డి, వైవి సుబ్బారావు మండల అధ్యక్షురాలు భూలక్ష్మి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దారా అంబేద్కర్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN