Guntur: జిల్లా స్థాయి యోగా పోటీల్లో రాణించిన ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ విద్యార్థులు!

Guntur: మున్నంగి హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల విద్యార్థుల ప్రదర్శన. రాష్ట్రస్థాయికి ఎంపికైన 7 గురు విద్యార్థులు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Sept 2026 5:13 PM IST
Guntur
X

Guntur: జిల్లా స్థాయి యోగా పోటీల్లో రాణించిన ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ విద్యార్థులు!

Guntur: యోగ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గుంటూరులోని మున్నంగి హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (ఉర్దూ బాలుర) విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో మొత్తం ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు.

14–18 సంవత్సరాల విభాగంలో ఇద్దరు, 8–14 సంవత్సరాల విభాగంలో ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలు అక్టోబర్ 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించనున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రజిని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ శ్రీ ఆర్. శ్రీనివాసులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN