Guntur: ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా యువత పోరాడాలి!
Guntur: గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ ఎన్ఎస్ యూఐ కో ఆర్డినేటర్ షేక్ కరీం విలేకరుల సమావేశం నిర్వహించి ఓట్ల తొలగింపుపై యువత పోరాడాలని పిలుపునిచ్చారు.
Guntur: ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా యువత పోరాడాలి!
Guntur: రాజ్యాంగంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడై పోరాడాలని పిలుపునిస్తూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం, మీడియా సమావేశంలో మాట్లాడుతూ "ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. దేశంలో ఓటు చోరీ జరుగుతోంది. మహదేవపురా లాంటి ఒకే నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్చారని మన నాయకుడు రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇది కేవలం ఓట్ల అక్రమం కాదు, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న బహిరంగ దాడి.
SIR పేరుతో కుట్ర:
ఎలక్షన్ కమిషన్ SIR - Special Intensive Revision పేరుతో నిజమైన ఓటర్లను తొలగిస్తోంది. బీహార్ లో మొదలుపెట్టిన ఈ కుట్రను ఇప్పుడు దేశమంతా అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కోట్ల 14 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇది చిన్న విషయం కాదు, 13 కోట్ల మంది గొంతు నొక్కడమే. 13 కోట్ల మంది భవిష్యత్తుతో ఆడుకోవడమే.
మన AP లోనే 44 లక్షల ఓట్లు మాయం:
మన ఆంధ్రప్రదేశ్ లోనే ఏకంగా 44 లక్షల ఓట్లు తొలగించారు. మన ఇంటి పక్కన ఉన్న పేదోడి ఓటు, కాలేజీకి వెళ్లే విద్యార్థి ఓటు, పొలంలో పని చేసే రైతు ఓటు మాయం అయింది. దీనిపై మనమే ప్రశ్నించాలి.
ఓటు లేకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది..? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్న హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? యువతను ఓటు లేకుండా చేసి, ఉద్యోగం లేకుండా చేసి రోడ్డున పడేయాలని చూస్తున్నారు. అందుకే NSUI పిలుపునిస్తోంది-'నా ఓటు, నా భవిష్యత్తు'. ప్రతి విద్యార్థి తన ఓటును కాపాడుకోవాలి. ప్రతి ఇంటి నుండి ఒకరు రాజ్యాంగ పరిరక్షణకు సైనికుడిగా మారాలి" అని అన్నారు. ఈ కార్యక్రమంలో మదన్, మీరవలి, అర్షద్, షాహిల్, సలాం, ఖాజా, నాగుర్, రహ్మాన్ , తదితరులు పాల్గొన్నారు.




