Mangalagiri: ఏపీ హజ్ 2027 సేవా సహాయకుల ముఖాముఖి పూర్తి
Mangalagiri: మంగళగిరి మండలం వడ్డేశ్వరంలో హజ్ 2027 యాత్రకు సంబంధించి 78 మంది తాత్కాలిక సేవా సహాయకులకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించారు.
Mangalagiri: ఏపీ హజ్ 2027 సేవా సహాయకుల ముఖాముఖి పూర్తి
Mangalagiri: మంగళగిరి మండలం వడ్డేశ్వరం గ్రామంలోని డీజీపీ ఆఫీస్ పక్కన సి ఈ డి ఎం(C.E.D.M) కార్యాలయంలో హజ్ 2027 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి తాత్కాలికంగా అన్ని ప్రభుత్వ విభాగాల నుండి ఎంపికైన సేవా 78 సహాయకులకు (State Haj Inspectors) ముఖాముఖి పరీక్షల నిర్వహణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
వీరిలో మార్కుల ఆధారంగా సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా 19 మందిని ఎంపిక చేస్తారు. రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు హాజీ షేక్ హసన్ భాష, ఈ. వో అబ్దుల్ ఖాదర్ పర్యవేక్షణలో భారత హజ్ కమిటీ (ముంబై) ఆదేశాల మేరకు ముఖాముఖి పరీక్షలు ఉదయం 9 గంటలకు హాజరు, 9:30 నుండి 12:30 వరకు పత్రాల పరిశీలన, 10:30 నుండి సాయంత్రం వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనార్టీ శాఖ ప్రిన్సిపుల్ సెక్రెటరీ సిహెచ్ శ్రీధర్, వక్ఫ్ బోర్డు సీఈవో యాకుబ్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ హజ్ సేవకులు సేవా దృక్పథంతో పనిచేయాలని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రభుత్వ అధికారిగా కాకుండా సేవకుడిగా యాత్రలో పనిచేయాలని తెలియజేశారు.
హజ్ హౌస్ నిర్మాణం త్వరలో చేపడుతామన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, సభ్యులు, హజ్ కార్యాలయ సిబ్బంది ధన్యవాదములు తెలిపారు.
ఇస్లాం ధర్మంలోని ఐదు మూల స్తంభాలలో హజ్ ఒకటి. ఆర్థికంగా, శారీరకంగా స్థోమత ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన పవిత్ర యాత్ర.
- మక్కాలోని కాబా దర్శనం, అరఫా మైదానంలో ప్రార్థన, మినా, ముజ్దలిఫాలో ఆచారాలు - పాపాల నుండి విముక్తి, అల్లాహ్ సాన్నిధ్యానికి మార్గం.
- హజ్ సమానత్వం, సోదరభావం, త్యాగానికి ప్రతీక. ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది ఒకే వస్త్రధారణలో ఒక్కటవుతారు.
- హాజీలకు సేవ చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు, అందుకే సేవా సహాయకుల (SHI) పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఏపీ కూటమి ప్రభుత్వం - ముస్లిం సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి వెళ్లే ప్రతి హాజీకి రూ.1,00,000 ఆర్థిక సాయం. విజయవాడను అధికారిక ఎంబార్కేషన్ గా కేంద్రం ఆమోదించింది.మైనారిటీ సంక్షేమానికి భారీ బడ్జెట్ కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ,హజ్ కమిటీ సభ్యులు బాబా ఫక్రుద్దీన్, మన్సూర్ అలీ ఖాన్, షేక్ హుస్సేన్, షేక్ ఆబిద్, హజ్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




