Guntur: వైసీపీ అభ్యర్థి అరెస్ట్‌పై అంబటి ఆగ్రహం: పోలీసులపై ఫైర్!

Guntur: దాచేపల్లి వైసీపీ అభ్యర్థి అరెస్ట్‌పై అంబటి రాంబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా కుట్ర రాజకీయాలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతోందన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Oct 2026 1:06 PM IST
Guntur
X

Guntur: వైసీపీ అభ్యర్థి అరెస్ట్‌పై అంబటి ఆగ్రహం: పోలీసులపై ఫైర్!

Guntur: గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలయ్యింది. కూటమి పోలీసులను అడ్డంపెట్టుకుని కుట్రలు చేస్తుందని ముందే చెప్పాం. దాచేపల్లి నగర పంచాయతి వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్ ను ఉదయం అరెస్టు చేశారు.

తెలంగాణ మద్యం అక్రమంగా ఉందని అరెస్టు చేశారు. రవికుమార్ ఆర్థికంగా స్థితిమంతుడు. పోలీసులే మద్యం తీసుకొచ్చి వాళ్ళే తనిఖీలు చేసి రవికుమార్ ను అరెస్టు చేశారు. ఏంటి ఘోరం... ఇది న్యాయమేనా. కాపు సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ పోటీ చేస్తే మీకెందుకు భయం.

లిక్కర్ అమ్ముకోవాల్సిన ఖర్మ వారికిలేదు. రవికుమార్ తండ్రి సాంబయ్య గతంలో ఛైర్మన్‌గా పనిచేశారు. రవికుమార్ ను ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వరు... అరెస్టులు చేసి గెలవాలని చూస్తున్నారు.

దాచేపల్లిలో గెలవలేక అక్రమ మార్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. రవికుమార్ పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించాలి. పోలీసులు సక్రమంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నా. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు. రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారు. సాయికృష్ణ రౌడీ అంటూ పోలీసులే చంపేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN