Guntur: రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది!
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని, సుప్రీంకోర్టు జోక్యంతోనే ఈసీ, పోలీసులు వైఖరి మార్చుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
Guntur: రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది!
Guntur: గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు 19 చోట్ల జరిగాయి. దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఎన్నికలను నిలిపివేశారు.
అంతే కానీ మొత్తం స్తానాల్లో నిలుపుదల చేయలేదు. సుప్రీంకోర్టు స్పంధించటం వల్లనే ఎన్నికల కమీషన్,పోలీసులు తమ వైఖరి మార్చుకున్నారు. ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత పెరిగి,వైసీపీకి అనుకూలత పెరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు.
సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది. ఐపీఎస్,ఐఏఎస్ అధికారులు తమ తప్పులను సరిచేసుకోవాలి. తప్పులు చేసిన ఏ అధికారినీ వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టదు,కోర్టు ముందు నిలబెడుతుంది.
ఎన్నోచోట్ల నామినేషన్లు వేయకుండా పోలిసులను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు బెదిరిస్తున్నారు. గుంటూరు లో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. రెండున్నర ఏళ్ళలో కూటమి ప్రభుత్వం కూలిపోయి,జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. గుంటూరు లో 76 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తుంది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాపరిషత్, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా పల్నాడులో వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారు. దీనిపై కూడా వైసీపీ కోర్టును ఆశ్రయిస్తుంది. వ్యవస్తలన్నీ చంద్రబాబు గుప్పెట్లో పెట్టుకుని గెలుపొందాలని చూస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు స్పంధించేవరకూ ఎన్నికల కమీషన్ స్పందించలేదు.




