Guntur: చుట్టుగుంట వాకింగ్ ట్రాక్‌లో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం!
Guntur: గుంటూరు చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Guntur: చుట్టుగుంట వాకింగ్ ట్రాక్‌లో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం!
Guntur: కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్య నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మరియు 32, 33 వార్డుల కూటమి ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాకింగ్ ట్రాక్‌కు విచ్చేసిన స్థానిక ప్రజలు, మార్నింగ్ వాకర్స్‌ను కలిసి కూటమి ప్రగతి పథకాలను, రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి పనులను వివరించి, కూటమికి మద్దతు తెలపాలని కోరడం జరిగింది. ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది!




