Guntur: వీధి కుక్కల ఏబీసీ వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్
Guntur: గుంటూరు నగరంలో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) శస్త్రచికిత్సలు వేగవంతం చేయాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు.
Guntur: వీధి కుక్కల ఏబీసీ వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసి) రోజువారీ పురోగతి ఉండాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ఏబీసి అత్యంత ముఖ్యమని, అందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులతో ఏబీసి సెంటర్ ని నిర్మాణం చేశామన్నారు.
సెంటర్ లో ప్రతి రోజు ఏబీసి, ఏఆర్వీలు సంఖ్య పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలు అందించాలని విఏఎస్ ని ఆదేశించారు. విఏఎస్ ఏబీసి సెంటర్ లోనే ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే కాల్ సెంటర్ లేదా ఇతర వేదికల ద్వారా అగ్రెసివ్ కుక్కలకు సంబంధించి ఫిర్యాదులు అందితే తక్షణం స్పందించాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న సెంటర్లకు అదనంగా నిర్మాణం చేస్తున్న కేంద్రం పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తీ చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిఈఈ, ఏఈలను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఉన్నందున ఏబీసిల సంఖ్య పెరగాలన్నారు.
సెంటర్ పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ, ఏబీసి చేసిన వాటికి నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఫీడింగ్, షెల్టర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విఏఎస్ ని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటి కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, డిఈఈలు సతీష్ కుమార్, చైతన్య, ఏఈ అబ్దుల్ గౌస్ పాల్గొన్నారు.




