Chirala: 500 మందికి కండువా కప్పిన ఎమ్మెల్యే మాలకొండయ్య!

Chirala: చీరాలలో భారీగా టీడీపీలోకి చేరికలు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో కండువా కప్పుకున్న 500 మంది.. పట్టణంలో భారీ ర్యాలీ.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 17 Sept 2026 11:27 AM IST
Chirala
X

Chirala: 500 మందికి కండువా కప్పిన ఎమ్మెల్యే మాలకొండయ్య!

Chirala: చీరాల పట్టణంలోని 25, 26, 27వ వార్డులకు చెందిన సుమారు 500 మంది మూలి శ్రీనివాసరెడ్డి అలియాస్ పప్పు చెక్క శీను ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం, బస్టాండ్ సెంటర్ మీదుగా రైల్వే పడమర వైపు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం విఠల్ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మాలకొండయ్య పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొనడంతో చీరాల పట్టణంలో సందడి నెలకొంది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala