Guntur: రాయపాటి సాంబశివరావు మృతితో గుంటూరులో అలముకున్న విషాద ఛాయలు!
Guntur: గుంటూరు ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు.
Guntur: రాయపాటి సాంబశివరావు మృతితో గుంటూరులో అలముకున్న విషాద ఛాయలు!
Guntur: కాంగ్రెస్ సుధీర్త కాలం పాటు పనిచేశారు 83లో 20 సూత్రాల ఆర్థిక కమిటీ చైర్మన్గా చేశారు ఇందిరాగాంధీ కుటుంబంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. అనంతరం తెలుగుదేశం పార్టీ లో చేరారు.రాజకీయ ప్రస్థానం 1982–1988 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.1996లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు.
1998లో తిరిగి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో గుంటూరు ఎంపీగా గెలుపొందారు.2009లో మరోసారి గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.
మొత్తంగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన అనుభవం ఆయనకు ఉంది.రాయపాటి రాజకీయ నాయకుడిగానే కాకుండా పారిశ్రామికవేత్తగా, విద్యారంగానికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. పొగాకు ఎగుమతుల రంగంలో విశేష కృషి చేశారు.1992–93లో అత్యుత్తమ ఎగుమతులకు రాష్ట్రపతి అవార్డు పొందినట్లు లోక్‌సభ జీవిత చరిత్రలో ఉంది. టొబాకో బోర్డు వైస్ చైర్మన్‌గా పనిచేశారు. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల వంటి విద్యాసంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది.




