Bapatla: బాపట్ల రైల్వే స్టేషన్లో 18 కేజీల గంజాయి స్వాధీనం!
Bapatla: బాపట్ల రైల్వే స్టేషన్లో బిలాస్పూర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో 18 కేజీల గంజాయిని జిఆర్పి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.టీసీ ఇచ్చిన సమాచారంతో సూట్‌కేస్‌ను తనిఖీ చేసి కేసు నమోదు.
Bapatla: బాపట్ల రైల్వే స్టేషన్లో 18 కేజీల గంజాయి స్వాధీనం!
Bapatla: బాపట్ల రైల్వేస్టేషన్లో జి ఆర్ పి ఎఫ్ పోలీసులకు TC ద్వారా వచ్చిన సమాచారం మేరకు గంజాయి తో ఉన్న 18 కేజీల సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. బిలాస్పూర్ నుండి తిరుపతి వెళ్లే రైలు నెంబర్ 17 4 81 నందు కొందరు అనుమానితులు సూట్ కేసులో గంజాయి ను తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు బాపట్ల జి ఆర్ పి ఎస్ ఐ సత్యవతి ,ఇంచార్జి ఎస్ఐ సుభాని సిబ్బందితో కలిసి సూట్ కేసును తనిఖీ చేస్తుండగా గంజాయి ఉన్న సూట్ కేస్ గుర్తించినట్లు తెలిపారు. సూట్ కేసును తనిఖీ చేస్తుండగా అనుమానితులు పరారైనట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తించిన సూట్‌కేస్ గంజాయి మొత్తం పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలియజేశారు.




