Kukunoor: జోరువానలోనూ ఆగని వైసీపీ ఎన్నికల ప్రచారం!
Kukunoor: కుక్కునూరు మండలం మారేడుబాక, కివ్వాక గ్రామాల్లో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Kukunoor: జోరువానలోనూ ఆగని వైసీపీ ఎన్నికల ప్రచారం!
కుక్కునూరు: మండల పరిధిలోని మారేడుబాక, కివ్వాక గ్రామాల్లో జోరువానను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. వైసీపీ మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ, మారేడుబాక గ్రామ కన్వీనర్ దాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి ఉకే రాధ, జడ్పీటీసీ అభ్యర్థి చిలకా రాణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారానికి విరామం ఇవ్వకుండా స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
జోరువానలోనూ అభ్యర్థులు, నాయకులు వెనుకడుగు వేయకుండా ప్రచారం కొనసాగించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




