Kukunoor: కుక్కునూరు మండలం వింజరం ఎంపీటీసీగా నూనె జ్యోతి విజయం!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వింజరం ఎంపీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నూనె జ్యోతి విజయం.
Kukunoor: కుక్కునూరు మండలం వింజరం ఎంపీటీసీగా నూనె జ్యోతి విజయం!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వింజరం–కొండపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నూనె జ్యోతి విజయం సాధించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన నూనె జ్యోతికి అభినందనలు తెలియజేస్తూ బాణసంచా కాల్చి, వైసీపీ అనుకూల నినాదాలతో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో ర్యాలీ సందడిగా సాగింది. విజయోత్సవాల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.




