Eluru: అవినీతి రహిత సమాజం అందరి బాధ్యత: ఏసీబీ డీఎస్పీ
Eluru: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, సమాచారం గోప్యంగా ఉంచుతామని ఏలూరు డీఎస్పీ కృష్ణారావు తెలిపారు.
Eluru: అవినీతి రహిత సమాజం అందరి బాధ్యత: ఏసీబీ డీఎస్పీ
Eluru: సమాజంలో అవినీతిని రూపుమాపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ జి.వి.కృష్ణారావు పిలుపునిచ్చారు. ఏలూరు ఏసీబీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల్లో అవినీతిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం ప్రముఖ కూడళ్లలో కరపత్రాలు,గోడపత్రికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446157, 9440446158, 9440446159 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, అవినీతిపరులపై తక్షణ చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.అనంతరం విలేకరులతో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసు,సిబ్బంది పాల్గొన్నారు.




