Chintoor: పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలి: బొర్రా నరేష్ కుమార్!

Chintoor: పోలవరం నిర్వాసితులకు సమగ్ర పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ పి. ప్రశాంతికి వి.ఆర్.పురం టీడీపీ మండల అధ్యక్షుడు బొర్రా నరేష్ కుమార్ వినతిపత్రం అందజేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 16 Sept 2026 7:14 PM IST
Chintoor
X

Chintoor: పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలి: బొర్రా నరేష్ కుమార్!

చింతూరు: పోలవరం జిల్లా విఆర్ పురం మండలంలో నిర్వాసితులు అవుతున్న ప్రతి ఒక్కరికి పరిహారం పునరవాసం కల్పించాలంటూ మండల టిడిపి అధ్యక్షుడు బొర్రా నరేష్ కుమార్ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ పి ప్రశాంతి కు వినతిపత్రం అందించారు. కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పరిహారం పునరావాసం కల్పించాలని అన్నారు.

పిడిఎఫ్ లిస్టులో ఉండి మరణించిన వారికి వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని కోరారు.విఆర్ పురం మండలంలోని బీసీ కాలనీ,రామవరంపాడు లోని 104 ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. జల్లివారిగూడెం గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని 41.15 కాంటూర్ లో చేర్చి ఆ భూమికి నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు.

విఆర్ పురం మండలంలోని పెండింగ్ లో ఉన్న ఇంటి విలువలు మరియు ఆర్ అండ్ ఆర్ త్వరగా చెల్లించాల్సిందిగా విన్నవించుకున్నారు. చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్ పోలవరం నిర్వాసితులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారని, నిర్వాసితుల సమస్యలకు చక్కటి పరిష్కారాలు చూపిస్తున్నారని తెలిపారు. కావున పరిహారం పునరావాసం నిర్వాసితులకు కల్పించే వరకు ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్ ను ఇక్కడే విధులను నిర్వర్తించేలా చూడాలని కోరారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR