Velerupadu: నాల్లవరం గ్రామస్థులకు ఇళ్ల పట్టాల పంపిణీ
Velerupadu: వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో నాల్లవరం గ్రామస్థులకు ఆప్షన్-2 కింద ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
Velerupadu: నాల్లవరం గ్రామస్థులకు ఇళ్ల పట్టాల పంపిణీ
వేలేరుపాడు: మండల పరిధిలోని నాల్లవరం గ్రామస్థులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆప్షన్–2 కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటిపల్లి ముత్యాలరావు, రామారావు, కురిమెళ్ల కృష్ణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, బద్దుల శివరామ్, కుడియం భాను, సాంబ శివ, కోర్రి కౌశిక్, అల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.




