Velerupadu: వేలేరుపాడులో వరదలకు మిర్చి నాశనం: ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి

Velerupadu: భారీ వర్షాలు, గోదావరి వరదలతో వేలేరుపాడు మండలంలో మునిగిన మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము డిమాండ్ చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 29 Sept 2026 6:05 PM IST
Velerupadu
X

Velerupadu: వేలేరుపాడులో వరదలకు మిర్చి నాశనం: ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి

వేలేరుపాడు: భారీ వర్షాలు, గోదావరి వరదలతో వేలేరుపాడు మండలంలో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము తెలిపారు. మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము, తాట్కూర్‌గొమ్ము, తిరుమలాపురం, నాల్లవరం ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల్లో పంట నీటమునిగి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

వేలేరుపాడు సీపీఐ మండల కార్యాలయంలో పిట్టా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎకరాకు రూ.50–60 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు నష్టపోయారని తెలిపారు.

ప్రభుత్వం పంట నష్టాన్ని తక్షణమే పరిశీలించి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారం దారయ్య,నాయకులు పిట్టా వీరయ్య, బంధం అర్జున్, బంధం నాగేశ్వరావు, కరటం వెంకటేశ్వరావు,తాటి దుర్గారావు,సోడే సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR