Velerupadu: వేలేరుపాడులో రోడ్డు ప్రమాదం: వెదురు ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్

Velerupadu: వేలేరుపాడు-నెమలిపేట మార్గంలో రోడ్డుపై నిలిపిన వెదురు ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి; వెదురు అక్రమ రవాణాపై విచారణకు డిమాండ్.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 4 Oct 2026 8:59 PM IST
Velerupadu
X

Velerupadu: వేలేరుపాడులో రోడ్డు ప్రమాదం: వెదురు ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్

వేలేరుపాడు: వేలేరుపాడు నుంచి నెమలిపేట వైపు వెదురు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం, ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై ట్రాక్టర్‌ను నిలిపి వెళ్లడంతో, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం లైట్ వెలుతురు తక్కువగా ఉండటంతో రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను గుర్తించలేక ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

అయితే రాత్రి సమయంలో తరలిస్తున్న వెదురును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, వెదురును అక్రమంగా తరలిస్తున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గాయపడిన వ్యక్తి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. వెదురు రవాణా చట్టబద్ధతపై కూడా అధికారుల విచారణలో స్పష్టత రావాల్సి ఉంది.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR