Velerupadu: రుద్రంకోటలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం

Velerupadu: వేలేరుపాడు మండలం రుద్రంకోట బీసీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించి గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 26 Sept 2026 4:18 PM IST
Velerupadu
X

Velerupadu: రుద్రంకోటలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం

వేలేరుపాడు: మండల పరిధిలోలోని రుద్రంకోట బీసీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. కుక్కునూరు ప్రాజెక్టు తట్కూరుగొమ్ము సెక్టార్-2 పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కోటారి సత్యనారాయణ, ముదిగొండ రామకృష్ణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సారె బాబ్జి, మహిళా మోర్చా నాయకురాలు సారె నాగమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సారె నాగమణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. బాలసంజీవిని కిట్లు, పాలు, గుడ్లు, పప్పు, నూనె, బాలామృతం వంటి పోషకాహార పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR