Kukunoor: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు!

Kukunoor: కుక్కునూరు మండలం శ్రీధర గ్రామంలో ఆదివారం తాటిచెట్టు ఎక్కుతుండగా జారిపడి వెంకటనారాయణ అనే గీత కార్మికుడికి నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 22 Nov 2026 7:55 PM IST
Kukunoor
X

Kukunoor: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు!

కుక్కునూరు: మండలంలోని శ్రీధర గ్రామంలో తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఆదివారం వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు నడుము వద్ద ఎముకకు బలమైన గాయం అయినట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR