Lingapalem: ఏలూరు జిల్లా లింగపాలెం సమీపంలో పెద్దపులి సంచారం!

Lingapalem: లింగపాలెం సమీప పొలాల్లో పెద్దపులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పూణే నుంచి రెస్క్యూ బృందం వస్తోందని డీఎఫ్ఓ తెలిపారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 17 Nov 2026 6:29 PM IST
Lingapalem
X

Lingapalem: ఏలూరు జిల్లా లింగపాలెం సమీపంలో పెద్దపులి సంచారం!

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి పి.వి. సందీప్ రెడ్డి సూచించారు.

పెద్దపులి కదలికలను VHF పరికరాల ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నామని,సురక్షితంగా బంధించేందుకు పూణే నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నామని తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు,పశువుల కాపరులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పొలాల వైపు వెళ్లవద్దని, పెద్దపులిని చూడటానికి గుంపులుగా వెళ్లడం, బెదిరించడం, రాళ్లు విసరడం చేయవద్దని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు. రెస్క్యూ ఆపరేషన్‌కు ప్రజలు సహకరించాలని డీఎఫ్ఓ విజ్ఞప్తి చేశారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid