Kukunoor: కుక్కునూరు మండలంలో సీసీ రోడ్లకు రూ.1.60 కోట్ల నిధులు మంజూరు
Kukunoor: కుక్కునూరు మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
Kukunoor: కుక్కునూరు మండలంలో సీసీ రోడ్లకు రూ.1.60 కోట్ల నిధులు మంజూరు
కుక్కునూరు: పల్లె పండుగ 3.0లో భాగంగా కుక్కునూరు మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1 కోటి 60 లక్షల నిధులు మంజూరు చేయడంపై కుక్కునూరు మండల టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు మంజూరు చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు, కూటమి నాయకులు మాట్లాడుతూ.. కుక్కునూరు మండల అభివృద్ధికి సహకరిస్తూ సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, మంత్రి నారా లోకేష్‌కు మండల టీడీపీ నాయకులు, కూటమి నాయకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
రూ.1.60 కోట్ల నిధుల మంజూరు మండలంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి దోహదపడుతుందని, సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించిన ప్రజాప్రతినిధులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.




