Nuzvid: నూజివీడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు.. వైస్ చైర్మన్‌గా హ్యాట్రిక్!

Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 24 Nov 2026 3:26 PM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు.. వైస్ చైర్మన్‌గా హ్యాట్రిక్!

నుజ్విడ్: నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పగడాల.సత్యనారాయణ వరుసగా మూడోసారి ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు.రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తన పట్టును నిలుపుకుంటూ వస్తున్న ఆయన, ముచ్చటగా మూడోసారి ఆ పదవిని అధిరోహించి హ్యాట్రిక్ సాధించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సత్యనారాయణ,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరి అదే పదవిని నిలబెట్టుకున్నారు.

తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల్లో 6వ వార్డు కౌన్సిలర్‌గా బరిలోకి దిగిన ఆయన,ప్రత్యర్థులపై 635 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.ప్రజాబలంతో పాటు కౌన్సిలర్ల మద్దతు కూడా కూడగట్టుకుని మరోసారి వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid