Kukkunuru: కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్న జెట్టి అరుణ్!
Kukkunuru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన జెట్టి అరుణ్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Kukkunuru: కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్న జెట్టి అరుణ్!
Kukkunuru: మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన జెట్టి అరుణ్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాండ్ర రాజేష్, ఉపాధ్యక్షుడు మాదిరాజు వెంకన్నబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మల్లేలా చంటి నాయుడు, రాయి సత్యనారాయణ, కుచర్లపాటి చిన్న నారసింహారాజు, వేల్పుల శ్రీనివాస్, రాయి మధు, పగిలా అల్లేష్, మచ్చ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




