Eluru: ఏలూరు జిల్లాలో నేటి నుంచి నెల రోజుల పాటు 'స్వచ్ఛతా హీ సేవా'!

Eluru: ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు 'స్వచ్ఛతా హీ సేవా' ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 7:36 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో నేటి నుంచి నెల రోజుల పాటు 'స్వచ్ఛతా హీ సేవా'!

ఏలూరు: ఏలూరు జిల్లాలో ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్,17వ తేదీ వరకు 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ రాష్ట్ర పురపాలక పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కు తెలిపారు.

'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం నిర్వహణ పై బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర పురపాలక పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమాన్ని నెల రోజులపాటు ఒక సామజిక ఉద్యమంగా నిర్వహించాలన్నారు.

సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలలో ప్రజలందరూ బాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా ఇంటికి వచ్చే చెత్త సేకరణ వాహనానికి తడి,పొడి చెత్తలను వేరుచేసి అందించేలా అవగాహన కలిగించాలన్నారు. అపారిశుద్ద్యం కారణంగా వ్యాధుల వ్యాప్తి,అనారోగ్య పరిస్థితులపై ప్రజలను తెలియజేయాలన్నారు.

ఏలూరు జిల్లా నుండి పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఏలూరు జిల్లాలో 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను మంత్రికి తెలియజేసారు. జిల్లాలో ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్, 17వ తేదీ వరకు 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం ప్రతీ గ్రామం, పురపాలక సంఘాలలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ,జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు,మునిసిపల్ కమిషనర్లు,ఎంపిడిఓలు, ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్