Eluru: బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వినూత్న స్వచ్ఛత కార్యక్రమాలు!

Eluru: ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన ‘స్వచ్ఛత అభియాన్ 6.0’ ముగింపు వేడుకలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 6:20 AM IST
Eluru
X

Eluru: బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వినూత్న స్వచ్ఛత కార్యక్రమాలు!

Eluru: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన ‘స్వచ్ఛత అభియాన్ 6.0’ ప్రచార కార్యక్రమాలు నేటితో ఘనంగా ముగిశాయి.

మిషన్ వాత్సల్యతో అనుసంధానమైన జిల్లాలలోని అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ (CCIs) లో అక్టోబర్ 2 నుండి 30 వరకు ఈ స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.ముగింపు రోజైన నేడు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO) డాక్టర్ సిహెచ్.సూర్య చక్రవేణి నేతృత్వంలో డీసీపీయు (DCPU),చైల్డ్ హెల్ప్‌లైన్ (CHL) కార్యాలయాలు,శిశు గృహ మరియు వివిధ సీసీఐలలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.

ఇందులో భాగంగా పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత మొక్కలు నాటడం మరియు పిల్లలకు చేతులు కడుక్కునే విధానం (హ్యాండ్ వాష్) పై అవగాహన కల్పించారు.ఈ ముగింపు వేడుకల్లో డీసీపీయు సిబ్బంది మహేష్,శంకర్,చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్లు రాజ్యలక్ష్మి,రాహుల్,శిశు గృహ ఏఎన్ఎం వైశాలి,ఆయాలతో పాటు స్థానిక చైల్డ్ కేర్ హోమ్స్‌లోని పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్