Eluru: ఏలూరు జిల్లాలో ఈ నెల 29న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Eluru: ఏలూరు జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వీడియో ఫుటేజీని పెన్ డ్రైవ్‌లలో భద్రపరచాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
Eluru: ఏలూరు జిల్లాలో ఈ నెల 29న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Eluru: ఏలూరు జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్,కౌంటింగ్ ప్రక్రియల వీడియో ఫుటేజీని తప్పనిసరిగా పెన్ డ్రైవ్‌లలో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.జిల్లాలో రెండవ,మూడవ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం ఆమె రిటర్నింగ్ అధికారులు,ఎన్నికల సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు,జంగారెడ్డిగూడెం డివిజన్లలోని ఎనిమిది మండలాల్లో రెండవ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం 194 పంచాయతీలకు గాను 34 సర్పంచ్,753 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయని,మిగిలిన 160 సర్పంచ్, 1,219 వార్డు సభ్యుల పదవులకు ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని వివరించారు.
ఈ ఎన్నికల్లో 3 లక్షల 68 వేల 871 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా,1,949 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.వీటిలో 673 సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు కల్పించారు. 29వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగి, మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను,ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా సీసీ కెమెరాలు,వీడియో చిత్రీకరణ పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,డీపీఓ మల్లికార్జునరావుతో పాటు పలువురు ఆర్డీఓలు,ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.




